Arvind Kejriwal: కేజ్రీవాల్ కు నిరాశ.. కస్టడీ పొడిగింపు
- మరో 14 రోజుల పాటు కేజ్రీవాల్ కస్టడీని పొడిగించిన కోర్టు
- మే 7న కేజ్రీని మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ
- కవితకు కూడా రిమాండ్ పొడిగించిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మరో 14 రోజులు తీహార్ జైల్లో గడపనున్నారు. మే 7న కేజ్రీవాల్ ను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ను కూడా కోర్టు 14 రోజుల పాటు పొడిగించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్, కవిత ఇద్దరూ కూడా మే 7 వరకు జైల్లో ఉండనున్నారు.
మరోవైపు మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 15న విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం... అరెస్ట్ అంశంపై ఈడీ వివరణ కోరింది. ఈడీ వివరణ ఇంకా పెండింగ్ లో ఉంది.