Ruturaj Gaikwad: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. 17 ఏళ్లలో ఇదే తొలిసారి

with Ruturaj Gaikwad first time a CSK captain has made a century in the IPL

  • సెంచరీ బాదిన తొలి చెన్నై కెప్టెన్‌గా నిలిచిన గైక్వాడ్
  • లక్నోపై సెంచరీతో రికార్డు సాధించిన సీఎస్కే కెప్టెన్
  • చెన్నై కెప్టెన్‌గా ధోనీ పేరిట అత్యధిక స్కోరు 84 పరుగులు

మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. సొంత మైదానం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చివరి వరకు క్రీజులో ఉండి 60 బంతుల్లో 108 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అనూహ్య రీతిలో ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా గైక్వాడ్ నిలిచాడు. సీఎస్కే సెంచరీ బాదడం ఇదే తొలిసారి. సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ అత్యధిక స్కోరు 84* పరుగులుగా ఉంది. 17 ఏళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ధోనీ సెంచరీ సాధించలేదు. అయితే గైక్వాడ్ ఓపెనర్‌ కావడంతో సెంచరీ సాధించే అవకాశం లభించిందని చెప్పుకోవాలి. ఎంఎస్ ధోనీ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి అతడికి దక్కే బంతులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి భారీ స్కోర్లు సాధించే అవకాశం లభించదు.

కాగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మార్కస్ స్టొయినిస్ రికార్డు స్థాయి శతకం బాదడంతో 19.3 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఘన విజయం  సాధించింది. మార్కస్ స్టొయినిస్ కేవలం 63 బంతుల్లోనే 124 పరుగులు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా స్టొయినిస్ రికార్డు సాధించాడు.

  • Loading...

More Telugu News