Katta Anandbabu: బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై పోటీగా మాజీ వాలంటీర్

Former Volunteer Katta Anandbabu in fray against baptla mp nandigam suresh

  • నందిగం సురేశ్ ఎంపీ అయ్యాక వందల కోట్లు ఆర్జించారన్న మాజీ వాలంటీర్ కట్టా ఆనంద్‌బాబు 
  • గత ఐదేళ్లల్లో ప్రజలను పట్టించుకోక అక్రమార్జనే లక్ష్యంగా పనిచేశారని ఆగ్రహం
  • ఎంపీ అక్రమాలకు వ్యతిరేకంగా తాను ఎన్నికల బరిలోకి దిగినట్టు వెల్లడి

ఏపీలోని బాపట్ల లోక్‌సభ స్థానంలో ఓ మాజీ వాలంటీర్.. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌పై పోటీకి దిగారు. వాలంటీర్ పదవికి రాజీనామా చేసి, రెబెల్ అభ్యర్థిగా దిగినట్టు మాజీ వాలంటీర్ కట్టా ఆనంద్‌బాబు పేర్కొన్నారు. ఎంపీ అక్రమాలకు వ్యతిరేకంగానే తాను పోటీకి దిగుతున్నట్టు ఆయన వెల్లడించారు. మంగళవారం ఆర్వోకు ఆయన తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం బాపట్లలో కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. 

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడుపుతున్న నందిగం సురేశ్ గత ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా గెలిచాక రూ. వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని కట్టా ఆనంద్‌బాబు ప్రశ్నించారు. గత ఐదేళ్లల్లో సురేశ్ ప్రజలకు కనిపించకుండా, వారి సమస్యలను పట్టించుకోకుండా అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశారని మండిపడ్డారు. అద్దంకికి చెందిన ఓ బాలింత సీఎం సహాయనిధి కోసం ఉద్దండరాయునిపాలెం వెళ్లి ఎంపీ ఇంటి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని అన్నారు. ఆమె సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News