Kangana Ranaut: భవిష్యత్తులోనూ కాషాయమే: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగన

Saffron Everywhere Kangana Ranaut During Mega Rally In Jodhpur
  • రాజస్థాన్ లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
  • ప్రజలకు బీజేపీపై సంపూర్ణ విశ్వాసం ఉందని వెల్లడి
  • హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పోటీ చేస్తున్న ఫైర్ బ్రాండ్
ఇటీవలే రాజకీయరంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతోందని.. భవిష్యత్తులోనూ అదే కెరటం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.

హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కంగన.. తాజాగా రాజస్థాన్ లోని జోధ్ పూర్ బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. సంప్రదాయ రాజస్థానీ తలపాగా ధరించి పార్టీ జెండా ఊపుతూ జోధ్ పూర్ లో మెగా రోడ్ షో నిర్వహించారు. ఆమె వెంట భారీగా తరలివచ్చిన పార్టీ మద్దతుదారులు భారత్ మాతా కీ జై, జై శ్రీరాం నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె ఎన్డీటీవీ చానల్ తో మాట్లాడారు. ప్రజల్లో బీజేపీపై ప్రేమ, ఆప్యాయత కనిపిస్తున్నాయని చెప్పారు. జోధ్ పూర్ ప్రజలకు బీజేపీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతోందని.. ఇకపైనా ఆ అలలు కొనసాగుతాయని కంగన వ్యాఖ్యానించారు.

అనంతరం పాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత పీపీ చౌదరికి మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా కంగన ఆరోపించారు. “వారు నా వ్యక్తిత్వంపై దాడి చేశారు. కానీ నా సైన్యం ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. ఎందుకంటే నాలోనూ రాజస్థాన్ డీఎన్ఏ ప్రవహిస్తోంది” అన్నారామె.
Kangana Ranaut
BJP
candidate
mega rally
Rajasthan

More Telugu News