Priyanka Gandhi: అమేథిలో రాబర్ట్ వాద్రాకు అనుకూలంగా వెలిసిన పోస్టర్లు

Posters emerge in Amethi amid uncertainty over Rahul return
  • ఇప్పటికే రాయ్‌బరేలిలో ప్రియాంకగాంధీకి అనుకూలంగా పోస్టర్లు
  • రాబర్ట్ వాద్రా కావాలని అమేథి ప్రజలు కోరుకుంటున్నారంటూ పోస్టర్లు
  • వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ
సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో... ప్రియాంకగాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని రాయ్‌బరేలిలో పోస్టర్లు వెలిసిన కొన్నిరోజులకే... ఆమె భర్త రాబర్ట్ వాద్రా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తాజాగా అమేథిలో బ్యానర్లు పుట్టుకువచ్చాయి. మంగళవారం అమేథిలోని గౌరీగంజ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెలుపల రాబర్ట్ వాద్రాకు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. ఈసారి రాబర్ట్ వాద్రా కావాలని అమేథి ప్రజలు కోరుకుంటున్నారని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

అమేథి 2019 వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. 2019లో స్మతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అమేథి, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయ్‌బరేలిలో ప్రియాంకకు అనుకూలంగా, అమేథిలో రాబర్ట్ వాద్రాకు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి.
Priyanka Gandhi
Robert Vadra
Rahul Gandhi

More Telugu News