Vijayasai Reddy: జూన్ 4 తర్వాత చంద్రబాబు పార్టీ ఉండదు: విజయసాయిరెడ్డి

Vijayasaireddy says there will be no more TDP after June 4
  • తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందన్న విజయసాయిరెడ్డి
  • ఏపీలోనూ అదే పునరావృతం అవుతుందని వ్యాఖ్యలు
  • బాబు చరిత్రహీనుడిగా నిష్క్రమిస్తాడని వెల్లడి
ఈ ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదు, చంద్రబాబు ఉండడని వైసీపీ ఎంపీ విజయసాయి ట్వీట్ చేశారు. హైదరాబాదులో 42 ఏళ్ల కిందట ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా పీకేసిందని, చంద్రబాబు తెలంగాణలో పూర్తిగా చాపచుట్టేశాడని పేర్కొన్నారు. 

16 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీ ఇలా అదృశ్యమైపోవడం ఎవరి స్వార్థ ఫలితం? ఇప్పుడు ఏపీలో కూడా అదే పునరావృతం అవుతుందని వివరించారు. ప్రజలే తుది తీర్పును వెలువరిస్తారని, జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత చంద్రబాబు పార్టీ ఉండదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

విజనరీ, అపర చాణక్యుడు అని ఎల్లో మీడియా జాకీలు, క్రేన్లు పెట్టి లేపిన బాబు చరిత్రహీనుడిగా రాజకీయ యవనిక నుంచి నిష్క్రమిస్తాడు... ఇది యథార్థం అని పేర్కొన్నారు.
Vijayasai Reddy
Chandrababu
YSRCP
TDP
Andhra Pradesh
Telangana

More Telugu News