JioCinema: జియోసినిమా సూపర్ ఆఫర్.. రూ. 29కే ప్రీమియం.. 4కే క్వాలిటీతో యాడ్ ఫ్రీ కంటెంట్
- ఓటీటీ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జియోసినిమా
- అందుబాటు ధరలో రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్
- రూ. 29కే నెల మొత్తం 4కే వీడియో క్వాలిటీతో యాడ్ ఫ్రీ కంటెంట్
- అయితే, ఈ ఆఫర్ ఒక్క డివైస్‌కు మాత్రమే వర్తింపు
- ఒకేసారి నాలుగు డివైస్‌లకు కావాలంటే రూ. 89 ప్లాన్
ఇప్పటికే టెలికాం రంగంలో ఎన్నో సంచనాలకు కేంద్ర బిందువైన జియో.. ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఓటీటీ ప్రియులకు తాజాగా సూపర్ ఆఫర్ ప్రకటించింది. జియో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా అందుబాటు ధరలో రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో రూ. 29, రూ. 89 ప్లాన్స్ ఉన్నాయి. కేవలం రూ. 29కే నెల మొత్తం 4కే వీడియో క్వాలిటీతో యాడ్ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే, ఈ ఆఫర్ ఒక్క డివైస్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఒకేసారి నాలుగు డివైస్‌లకు కావాలంటే మాత్రం రూ. 89 ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీడియో క్వాలిటీ పెంచడంతో పాటు యాడ్ ఫ్రీ కంటెంట్ ఈ ప్లాన్స్ ప్రత్యేకత.
రూ. 29 ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే..
నెలకు కేవలం రూ. 29 చెల్లిస్తే చాలు.. ఎలాంటి యాడ్స్ లేకుండా 4కే క్వాలిటీతో వీడియో కంటెంట్‌ను చూడొచ్చు. అలాగే డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు. జియో సినిమాలో వచ్చే కంటెంట్‌ను స్మార్ట్ టీవీ లేదా డివైజ్‌లోనూ చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే, ఒక సమయంలో ఒకే డివైస్‌లో మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది. గతంలో దీని ధర రూ. 59గా ఉండేది.
రూ. 89తో రీఛార్జ్ చేసుకుంటే..
ఇది ఫ్యామిలీ ప్లాన్. కుటుంబాలను ఆకర్షించేందుకు గానూ జియో సినిమా రూ. 89 ప్లాన్‌ను తీసుకొవచ్చింది. ఇది ఒకసారి రీఛార్జ్ చేస్తే నెల మొత్తం నాలుగు డివైజుల్లో కంటెంట్‌ను వీక్షించొచ్చు. రూ.29 ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు దీనికి కూడా వర్తిస్తాయి. గతంలో దీని ధర నెలకు రూ.149గా ఉండగా.. ఇప్పుడు రూ.89కి తగ్గించారు. ఇప్పటికే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నవారు.. ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారని జియో కంపెనీ తెలిపింది. ఈ రెండు ఆఫర్ల ద్వారా తమ సబ్‌స్క్రైబర్లను భారీగా పెంచుకోవాలని జియో సినిమా ప్లాన్ చేస్తోంది.
ఇక జియోసినిమా స్మార్ట్‌ఫోన్‌లు (ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్), స్మార్ట్ టీవీలు ( Google TV, FireOS, Apple TV), వెబ్ బ్రౌజర్‌లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో యాక్సెస్ చేయవచ్చు . స్క్రీన్ రిజల్యూషన్‌పై ఆధారపడి, ప్లాట్‌ఫారమ్ యొక్క స్ట్రీమింగ్ నాణ్యత పరిమితం చేయబడుతుంది. ఇది ప్రస్తుతం 4కే రిజల్యూషన్‌తో పుష్కలంగా కంటెంట్‌ను అందించడం జరగుతోంది.