Ch Malla Reddy: మెట్రో రైల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నిక‌ల‌ ప్రచారం

Telangana BRS MLA Malla Reddy Raids in Metro Rail
  • మెట్రో రైల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి హల్‌చల్ 
  • మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
  • ప్ర‌యాణికుల వ‌ద్ద‌కు వెళ్లి, కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని అభ్యర్థించిన బీఆర్‌ఎస్ నేత‌
మాజీ మంత్రి, మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా మెట్రో రైల్లో ప్రయాణించి హల్‌చల్ చేశారు. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్ర‌యాణికుల ద‌గ్గ‌రికి వెళ్లి, కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సంద‌ర్భంగా మల్లారెడ్డితో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఎగ‌బ‌డ్డారు. మల్లారెడ్డి వెంట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక మ‌ల్లారెడ్డి తనదైన హాస్య చతురోక్తులు, ఆటపాటలతో సందడి చేస్తుంటార‌నే విష‌యం తెలిసిందే.
Ch Malla Reddy
BRS
MLA
Telangana

More Telugu News