Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు, నివేదికలు కోరిన కమిషన్
- కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు, నివేదికలను కోరిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
- ప్రకటన జారీ చేసిన నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా
- ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్కు సాక్ష్యాధారాలతో అఫిడవిట్లు సమర్పించవచ్చునని వెల్లడి
బీఆర్కే భవన్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో ఫిర్యాదులు, నివేదనలు, దాఖలు చేసేందుకు మే 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు. పోస్టు ద్వారా కూడా ఫిర్యాదులు పంపించడానికి అవకాశం కల్పించారు. తగిన సాక్ష్యాలు, ప్రమాణ పత్రంలేని అఫిడవిట్లను తిరస్కరిస్తామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదికలను కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బహిరంగ ప్రకటన జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్కు సాక్ష్యాధారాలతో అఫిడవిట్లు సమర్పించవచ్చునని పేర్కొన్నారు.