Lok Sabha Polls: ఓటు హ‌క్కు వినియోగించుకున్న భార‌త మాజీ క్రికెటర్లు ద్ర‌విడ్‌, కుంబ్లే

Rahul Dravid and Anil Kumble Cast Vote in Bengaluru

  • క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న లోక్‌స‌భ‌ రెండో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్‌
  • బెంగ‌ళూరులో ఓటు వేసిన రాహుల్ ద్ర‌విడ్‌, అనిల్ కుంబ్లే
  • ప్ర‌తిఒక్క‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి ఓటు వేయాల‌న్న ద్ర‌విడ్‌
  • కర్ణాటకలో లోక్‌సభ రెండో దశ ఎన్నికల్లో శుక్రవారం 14 స్థానాలకు పోలింగ్

లోక్‌స‌భ‌ రెండో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్‌లో భాగంగా క‌ర్ణాట‌క‌లో ఓటింగ్ జ‌రుగుతోంది. దీంతో భార‌త మాజీ క్రికెట‌ర్లు రాహుల్ ద్ర‌విడ్‌, అనిల్ కుంబ్లే రాజ‌ధాని బెంగ‌ళూరులో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అంద‌రీతో క‌లిసి క్యూలో నిల‌బ‌డి మ‌రి ద్ర‌విడ్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం టీమిండియా కోచ్ ద్ర‌విడ్ మీడియాతో మాట్లాడారు. 'ప్ర‌తిఒక్క‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి ఓటు వేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో మనకు లభించే గొప్ప‌ అవకాశం' అని అన్నారు. అటు అనిల్ కుంబ్లే కూడా ఓటు హక్కు వినియోగించుకున్న త‌ర్వాత ఫొటోకు పోజిచ్చారు.   

కర్ణాటకలో లోక్‌సభ రెండో దశ ఎన్నికల్లో శుక్రవారం 14 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 543 స్థానాలు ఉన్న‌ పార్లమెంట్‌లో 28 స్థానాలు కర్ణాటకలో ఉన్నాయి. ఈ 28 స్థానాల‌కు రెండు దశల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నేడు మొద‌టి ద‌శ‌లో ఉడిపి చికమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపూర్, కోలార్ 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

కాగా, కర్ణాటకలో 2019 ఎన్నికల్లో 28 స్థానాలకు గానూ 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేస్తుండగా .. మిగిలిన 3 స్థానాల్లో మిత్రపక్షమైన జేడీఎస్ పోటీ చేస్తోంది. జేడీఎస్ పోటీ చేసే మూడు నియోజకవర్గాలు హాసన్, మాండ్య, కోలార్ రెండవ దశలో భాగంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News