Whatsapp: రంగులు మార్చేసిన వాట్సాప్.. ఏ ఆప్షన్లు మారిపోయాయి.. గమనించారా?

whatsapp has turned green for users

  • చాట్ అప్ డేట్స్ ఎరుపు రంగు నుంచి ఆకుపచ్చకు మార్పు
  • నీలి రంగులో ఉండే స్టేటస్ అప్ డేట్స్ కూడా గ్రీన్ కు..
  • కొత్త ఎక్స్ పీరియన్స్ కోసమేనంటున్న మెటా వర్గాలు

వాట్సాప్ యాప్ లో అంతర్గతంగా కొన్ని మార్పులు జరిగాయి. వాట్సాప్ ఇంటర్ఫేస్ లో ఇంతకాలం వివిధ రంగులను వినియోగించగా.. ఇప్పుడు పూర్తిగా ఆకుపచ్చ రంగుకు మారాయి. ప్రస్తుతం కొందరు వినియోగదారులకు అప్ డేట్లతో ఇది మారిపోయింది. కొన్ని రోజుల్లోనే అందరు వినియోగదారులకు ఈ ఆకుపచ్చ ఇంటర్ఫేస్ వచ్చేయనుంది.

ఏమిటీ మార్పులు
  • వాట్సాప్ లో ఎన్ని చాట్ అప్ డేట్స్ వచ్చాయనేదానికి సూచికగా నంబర్లు ఎరుపు రంగులో వచ్చేవి. చాట్స్ ఐకాన్ వెనుక రంగు ఏమీ విడిగా ఉండేది కాదు. ఇప్పుడీ నంబర్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. చాట్స్ ఐకాన్ వెనుక స్వల్పంగా ఆకుపచ్చ రంగు కనిపిస్తోంది.
  • వాట్సాప్ లో స్టేటస్ అప్ డేట్స్ ఐకాన్ నీలి రంగులో ఉండేది. ఇప్పుడు దాని నీలి రంగును తొలగించి.. గ్రే కలర్ లోకి మార్చారు. అప్ డేట్స్ ఏమైనా ఉంటే దానిపై ఆకుపచ్చ రంగులో డాట్ చూపించేలా మార్చారు.
  • వాట్సాప్ లో షేర్ చేస్తున్న లింక్ లు కూడా ఇంతకు ముందు నీలి రంగులో హైలైట్ అయ్యి కనిపించేవి. ఇప్పుడవి కూడా ఆకుపచ్చ రంగులోకి మారాయి.
  • సాధారణంగా వాట్సాప్ లోగో ముందు నుంచీ ఆకుపచ్చ రంగులోనే ఉంది. ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్ లోని అన్ని ఆప్షన్లను కూడా ఆకుపచ్చ రంగులోకి మార్చేస్తున్నారు.

కొత్త ఎక్స్ పీరియన్స్ కోసమంటూ..
  • వాట్సాప్ వినియోగంలో ఆధునికత, కొత్త ఎక్స్ పీరియన్స్ అందించడంలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్టు వాట్సాప్ యాజమాన్య సంస్థ ‘మెటా’ ప్రకటించింది. ఆకుపచ్చ రంగుతో కళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుందని తెలిపింది.
  • ఈ మార్పులు ఆప్షనల్ ఏమీ కాదని మెటా వర్గాలు తెలిపాయి. ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ వినియోగదారులైనా అందరికీ ఇదే గ్రీన్ ఇంటర్ఫేస్ ఉంటుందని.. అప్ డేట్ల ద్వారా ఈ మార్పు జరుగుతుందని మెటా వర్గాలు తెలిపాయి.
  • అయితే వినియోగదారుల నుంచి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా అన్ని ఆప్షన్లను ఆకుపచ్చ రంగులోకి మార్చడం ఏమీ బాగోలేదని చాలా మంది వినియోగదారులు అంటున్నారు. కొందరు మాత్రం.. సింగిల్ కలర్ థీమ్ బాగుందని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News