Ayurvedic Medicine: ఈ ఏడు ఆయుర్వేద పదార్థాలతో హెల్త్ సూపర్!
- మారిన జీవనశైలితో దెబ్బతింటున్న ఆరోగ్యం
- కొత్త కొత్త జబ్బులు పుట్టుకొస్తున్న వైనం
- జీవనశైలి అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంతో చక్కని పరిష్కారం
భారతదేశానికి మాత్రమే సొంతమైన ప్రాచీన వైద్య విధానం... ఆయుర్వేదం. పురాతన విజ్ఞాన సంపదగా భావించే ఉపవేదాల్లో ఆయుర్వేదానిదే అగ్రతాంబూలం. ప్రకృతిలో లభించే వనమూలికలనే ఆయుర్వేద చికిత్సలో ప్రధానంగా వినియోగిస్తుంటారు. సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఆయుర్వేద చికిత్స పొందితే అనేక అనారోగ్య సమస్యలను కట్టడి చేయవచ్చు.
ఇక అసలు విషయానికొస్తే... ప్రస్తుత జీవనశైలి మన ఆరోగ్యాన్ని అనేక విధాలా దెబ్బతీస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తోంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇలా జీవనశైలి కారణంగా వచ్చే జబ్బులను నయం చేయడంలో ఏడు ఆయుర్వేద పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ పదార్థాలేంటో ఈ కింది వీడియోలో చూసేద్దాం...