Buggana Rajendranath: ఎట్టకేలకు మంత్రి బుగ్గన నామినేషన్ ను ఆమోదించిన ఆర్వో

RO approves Buggana nomination in Dhone constituency
  • డోన్ నియోజకవర్గంలో వీడిన ఉత్కంఠ
  • టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అభ్యంతరంతో బుగ్గన నామినేషన్ పెండింగ్
  • సాయంత్రం లోపు ఆర్వోకు వివరాలు సమర్పించిన బుగ్గన న్యాయవాది
  • చివరి నిమిషంలో బుగ్గన నామినేషన్ కు ఆమోదం
నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ కు ఎట్టకేలకు ఆమోదం లభించింది. బుగ్గన నామినేషన్ పై టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. బుగ్గన నామినేషన్ పత్రాల్లోని పలు కాలమ్స్ ఖాళీగా ఉన్నాయని కోట్ల ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో, బుగ్గన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పెండింగ్ లో పెట్టారు. ఈ సాయంత్రం లోపు పూర్తి వివరాలు సమర్పించాలని ఆర్వో బుగ్గన న్యాయవాదిని కోరారు. ఆర్వో కోరినట్టుగా బుగ్గన న్యాయవాది వివరాలు సమర్పించారు. 

ఈ నేపథ్యంలో, డోన్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చివరి నిమిషంలో మంత్రి బుగ్గన నామినేషన్ ను ఆమోదించారు. దాంతో ఉత్కంఠకు తెరపడింది.
Buggana Rajendranath
Nomination
Dhone
RO
Kotla Suryaprakash Reddy
YSRCP
TDP

More Telugu News