Nominations: ఏపీలో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

Nominations scrutiny concluded in AP

  • ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు
  • ఏప్రిల్ 25తో ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
  • తాజాగా నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి
  • ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
  • ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, ఏప్రిల్ 25తో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. తాజాగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. 

రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు 686 నామినేషన్లు రాగా, వాటిలో 503 నామినేషన్లకు ఆమోదం లభించింది. 183 నామినేష్లను తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 16 నామినేషన్లు దాఖలయ్యాయి. 

అటు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 2,705 నామినేషన్లకు ఆమోదం లభించింది. 939 నామినేష్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి 52 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలయ్యాయి. 

కాగా, ఈ నెల 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక... తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News