Nara Lokesh: అది మేనిఫెస్టో కాదు... జగన్ రాజీనామా లేఖలా ఉంది: నారా లోకేశ్ సెటైర్

Nara Lokesh describes YCP Manifesto as Jagan resignation letter

  • ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్
  • జగన్ ఎన్నికలకు ముందు రాజీనామా చేసినట్టుగా ఉందన్న లోకేశ్
  • జగన్ అస్త్రసన్యాసం చేసినట్టు మేనిఫెస్టో చెబుతోందని వెల్లడి

ఏపీ సీఎం జగన్ ఇవాళ వైసీపీ మేనిఫెస్టో ప్రకటించడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈరోజు జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో చూశాక... ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా అనిపించిందని ఎద్దేవా చేశారు. 

మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ... రూ.200 రూపాయల పెన్షన్ ను రూ.2 వేలు చేసింది చంద్రబాబునాయుడు అని వెల్లడించారు. జగన్ అయిదేళ్లలో రూ.500 పెంచుతానని మేనిఫెస్టోలో ప్రకటించడం ఆయన దివాలాకోరు తనానికి నిదర్శనం అని విమర్శించారు. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు వైసీపీ మేనిఫెస్టో స్పష్టం చేస్తోందని అన్నారు. 

"రాబోయే ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమే... అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతాం. పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత నాది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతాం" అని లోకేశ్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News