KL Rahul: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్
- అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్‌గా రికార్డు సాధించిన లక్నో కెప్టెన్
- 94 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని సాధించిన రాహుల్
- ఆదివారం రాత్రి రాజస్థాన్ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో రికార్డు సాధించిన స్టార్ ఆటగాడు
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో కూడా రాణించాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమిని చవిచూసినప్పటికీ ఆ జట్టు 196 పరుగుల భారీ స్కోరు సాధించడంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. 48 బంతుల్లో 76 పరుగులు బాదాడు. ఇందులో 2 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు 35 పరుగుల వద్ద ఐపీఎల్‌లో ఆల్-టైమ్ రికార్డును కేఎల్ రాహుల్ సృష్టించాడు.
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. 32 ఏళ్ల రాహుల్ 94 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో పలువురు ఓపెనర్లు 4000 పరుగులు సాధించినప్పటికీ రాహుల్ కంటే వేగంగా సాధించలేకపోయారు.
ఓపెనర్‌గా ఐపీఎల్‌లో 4000లకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు..
1. శిఖర్ ధావన్ - 6362
2. డేవిడ్ వార్నర్ - 5909
3. క్రిస్ గేల్ - 4480
4. విరాట్ కోహ్లీ - 4041
5. కేఎల్ రాహుల్ - 4010.