Nominations: ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
- ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు
- ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- అభ్యర్థుల తుది జాబితాలు ప్రకటించనున్న ఎన్నికల సంఘం
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మే 13న పోలింగ్ జరగనుండగా, నేటి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లకు ఈసీ ఆమోదం లభించింది. 25 ఎంపీ స్థానాల కోసం 503 నామినేషన్లకు ఆమోదం లభించింది.
ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం... తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు ఆమోదం పొందాయి. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి 6 నామినేషన్లు ఆమోదం పొందాయి. లోక్ సభ నియోజకవర్గాల విషయానికొస్తే... నంద్యాల ఎంపీ స్థానానికి అత్యధికంగా 36 నామినేషన్లు ఆమోదం పొందాయి. అత్యల్పంగా రాజమండ్రి ఎంపీ స్థానంలో 12 నామినేషన్లు ఆమోదం పొందాయి.
నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన నేపథ్యంలో, ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అవకాశం ఉంది.