Nara Lokesh: చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు... మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం: లోకేశ్
- కూటమి మేనిఫెస్టోపై లోకేశ్ స్పందన
- సూపర్-6 పేరిట హామీలు ఇచ్చారన్న లోకేశ్
- యువతీయువకులకు ఉద్యోగాలపై భరోసా
ఇవాళ చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారని నారా లోకేశ్ వెల్లడించారు. అందులో బాబు సూపర్-6 పేరిట హామీలు ఇచ్చామని తెలిపారు. అందులో మొదటి హామీ ప్రకారం... టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నిరుద్యోగ యువతీయువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని లోకేశ్ ప్రకటించారు.
ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ పైనే తమ ప్రభుత్వ తొలి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు.
ప్యూన్ నుంచి కానిస్టేబుల్, గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదని, గూగుల్ ను శోధించాల్సిన అవసరం లేదని, సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.