Delhi Congress: ఢిల్లీలో కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా

Another Jolt To Delhi Congress Resigns Two Of Its Netas

  • ఇటీవలే పార్టీని వీడిన ఢిల్లీ పీసీసీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ
  • ఆప్‌తో పొత్తును నిరసిస్తూ మరో ఇద్దరు గుడ్‌బై
  • మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ
  • అర్విందర్ సింగ్ స్థానంలో పంజాబ్ ఇన్‌చార్జ్ దేవేందర్ యాదవ్‌‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించిన పార్టీ

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీలో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును నిరసిస్తూ ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ పార్టీకి రాజీనామా చేశారు. తన అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ఆప్‌తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపిస్తూ పార్టీని వీడారు. 

తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయ, నసీబ్ సింగ్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆప్‌తో పొత్తుపై అసంతృప్తి వ్యక్తి చేసిన వీరు నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఉదిత్ రాజ్ నామినేషన్‌ను వ్యతిరేకించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తమ రాజీనామా లేఖ పంపారు. కాగా, అర్విందర్ సింగ్ లవ్లీ  స్థానంలో పార్టీ పంజాబ్ ఇన్‌చార్జ్ దేవేందర్ యాదవ్‌ను ఢిల్లీ కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది.

  • Loading...

More Telugu News