Premikudu: ప్రభుదేవా 'ప్రేమికుడు' రీ రిలీజ్ వాయిదా

Prabhu Deva Movie Premikudu Re Release Postponed To June
  • సాంకేతిక కారణాలతో రిలీజ్ చేయలేకపోతున్నామన్న నిర్మాత మురళీధర్‌రెడ్డి
  • కొన్ని థియేటర్లలో విడుదలైందన్న వార్తలు నిజం కాదని వెల్లడి
  • జూన్‌లో విడుదల చేయనున్నట్టు చెప్పిన నిర్మాత
ప్రభుదేవా అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. మూడు దశాబ్దాల క్రితం కుర్రకారును ఊపేసి రికార్డులు కొల్లగొట్టిన ప్రభుదేవా సినిమా ‘ప్రేమికుడు’ నేడు రీ రిలీజ్ కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్, పొలిటికల్ డ్రామా మూవీని 4కే క్వాలిటీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇటీవల నిర్మాతలు రమణ, మురళీధర్ తెలిపారు. 300కు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని, అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తున్నట్టు చెప్పారు.

ఈ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ వరల్డ్ వైడ్ తెలుగు డిస్ట్రిబ్యూటర్ మురళీధర్‌రెడ్డి సినిమా వాయిదా వార్తను ప్రకటించారు. నేడు రీ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడినట్టు తెలిపారు. కొన్ని థియేటర్లలో సినిమా విడుదలైనట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సినిమా నేడు ఎక్కడా విడుదల కాలేదని, జూన్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. సినిమా రిలీజ్ డేట్‌తో మళ్లీ ఓ ఈవెంట్‌ నిర్వహిస్తామని, జూన్ నెలలో సినిమాను విడుదల చేస్తామని వివరించారు.
Premikudu
Prabhu Deva
Tollywood
Nagma
Shankar
AR Rahman
Premikudu Re Release

More Telugu News