Danam Nagender: నాపై నమ్మకంతో రేవంత్ రెడ్డి నన్ను నిలబెట్టారు... 2 లక్షల మెజార్టీతో గెలుస్తా: దానం నాగేందర్

Danam Nagendar says he will win from Secunderabad
  • అంజన్ కుమార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన గెలుపుకు దోహదపడతాయన్న నాగేందర్
  • బీజేపీ, బీఆర్ఎస్ మోసపూరిత మాటలను నమ్మవద్దని హెచ్చరిక
  • అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు, హక్కుల కోసం కాంగ్రెస్ పాటుపడుతుందని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్కడి నుంచి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. తాను 2 లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముషీరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన గెలుపునకు దోహదపడతాయన్నారు.

అనంతరం, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మోసపూరిత మాటలను నమ్మవద్దని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు, హక్కుల కోసం పాటుపడే కాంగ్రెస్‌‌కు మద్దతివ్వాలన్నారు. దానంకు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు రావడం ఖాయమన్నారు. అందరూ సైనికుల్లా పని చేసి దానంను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Danam Nagender
Congress
BJP
Lok Sabha Polls

More Telugu News