type 2 diabetes: దీర్ఘకాలం కలుషిత గాలితో టైప్ 2 డయాబెటిస్ ముప్పు!

A reportwarns that Long term exposure to polluted air increases risk of type 2 diabetes

  • మనిషి వెంట్రుక కంటే 30 రెట్లు చిన్నవైన కాలుష్య కారకాలే ఇందుకు కారణం
  • దీర్ఘకాలం కలుషిత గాలి పీల్చుకుంటే డయాబెటిస్ ముప్పు అధికం
  • మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్‌’లో పరిశోధనా పత్రం ప్రచురణ

కలుషితమైన గాలి వాతావరణంలో దీర్ఘకాలంపాటు జీవిస్తే టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు పొంచివుందని మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైన పరిశోధన పత్రం హెచ్చరించింది. కలుషిత గాలిలో ఉండే మానవ జుట్టు కంటే 30 రెట్లు సన్నగా ఉండే పార్టికల్ మ్యాటర్ (కణ పదార్థం) (PM) ఇందుకు కారణమవుతోందని హెచ్చరించింది. టైప్ 2 డయాబెటిస్ కేసులలో 20 శాతం కేసులు 2.5 పీఎం కాలుష్య కారకాలకు నిరంతరం ప్రభావితమైనట్టు తమ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. ఈ కాలుష్య కారకాలు మండే చమురు, డీజిల్, బయోమాస్, గ్యాసోలిన్ల నుంచి ఉద్గారమవుతాయని పేర్కొంది. 2.5 పీఎంని ‘ప్రాణాంతక కాలుష్య కారకం’గా సూచిస్తారని, పట్టణ ప్రాంతాల్లోని వాయు కాలుష్యంలో ఈ స్థాయి అధికంగా కనిపిస్తుందని తెలిపింది.

2.5 పీఎం కాలుష్య కారకాలతో కూడిన కాలుష్యంలో కొంతకాలం జీవించినా వ్యక్తులు ప్రభావిత మవుతారని, నాడీ వ్యవస్థపై కొంతకాలం పాటు దుష్ప్రభావం చూపుతుందని, ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించింది. అంతేకాదు 2.5 పీఎం స్థాయి కాలుష్య కారకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతారని పేర్కొంది.

2.5 పీఎం స్థాయి కాలుష్య కారకాలతో కూడిన కాలుష్య వాతావరణంలో ఎక్కువ కాలం జీవిస్తే నెలల ప్రాతిపాదికన రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుంటాయని వివరించింది. వెనుకబడిన, పేద పురుషులలో ఈ ప్రమాదం అధికమని వివరించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో సగం మందికి వారి పరిస్థితి గురించి తెలియదని ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొంది. కాగా భారత్‌లో సుమారు 77 మిలియన్ల మంది పెద్దలు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, భవిష్యత్తులో సుమారు 25 మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడొచ్చని అధ్యయనం అంచనా వేసింది.

  • Loading...

More Telugu News