Arogya Sri: ఏపీ ప్రభుత్వానికి ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల నెట్ వర్క్ లేఖాస్త్రం

Arogyasri hospitals network shot a letter to AP govt
  • బకాయిల చెల్లింపుపై ఎప్పటి నుంచో పోరాడుతున్న ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు
  • ఎల్లుండి నుంచి నగదు రహిత సేవలు నిలిపివేస్తామని హెచ్చరిక
  • ప్రభుత్వం ఆరు నెలలుగా బకాయిలపై పట్టించుకోవడంలేదని ఆగ్రహం 
గతంలో బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల నెట్ వర్క్ మరోసారి పోరుబాట పట్టింది. తమ సమస్యలు, డిమాండ్లతో ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు లేఖాస్త్రం సంధించింది. ఎల్లుండి నుంచి నగదు రహిత సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల నెట్ వర్క్ తన లేఖలో స్పష్టం చేసింది. ఆరు నెలలుగా బకాయిలపై పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది.
Arogya Sri
Hospitals Network
AP Govt
YSRCP

More Telugu News