Chhattisgarh Liquor Scam: చత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. రూ. 205 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం

ED attaches properties worth Rs 205 crore in Chhattisgarh liquor scam case

  • పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ
  • ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో 14 మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ టేటేజావే
  • అన్వర్ దేబార్‌కు చెందిన రూ. 116.16 కోట్ల విలువైన 115 ఆస్తుల అటాచ్

చత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాయపూర్ విభాగం దర్యాప్తులో భాగంగా నిన్న దాదాపు రూ. 205 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అవినీతి నిరోధకశాఖ చట్టం కింద రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదుచేసింది. 

ఈడీ తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో 14 మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజాకు సంబంధించినవి. వీటి విలువ రూ. 15.82 కోట్లు. అన్వర్ దేబార్‌కు చెందిన రూ. 116.16 కోట్ల విలువైన 115 ఆస్తులు ఉన్నాయి. అటాచ్ చేసిన అన్వర్ దేబార్‌కు చెందిన ఆస్తుల్లో రాయపూర్‌లోని వెన్నింగ్టన్ కోర్ట్ హోటల్ కూడా ఉంది.  వీటితో పాటు మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News