YS Jagan: బాలకృష్ణ ఇలాకాలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్

Jagan fires on Chandrababu in Hindupur

  • చంద్రబాబుకు ఓటేస్తే అనకొండ నోట్లో తల పెట్టినట్టేనన్న జగన్
  • 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్న
  • పెన్షన్లు ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శ

ఇచ్చిన అన్ని హామీలను ఈ 59 నెలల పాలనలో పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. అన్ని హామీలను నెరవేర్చిన మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మరోసారి మీ ముందుకు వచ్చాడని చెప్పారు. హిందూపురంలో నిర్వహించిన ప్రచార భేరిలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని చెప్పారు. ఇవి కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎంచుకునే ఎన్నికలు మాత్రమే కాదని.... మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని... పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని చెప్పారు. 

పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే అనకొండ నోట్లో తల పెట్టినట్టేనని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుందని చెప్పారు.  దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో రాష్ట్రంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించామని అన్నారు. మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేశామని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు, కాపు నేస్తం, వైఎస్సార్ చేయూత, ఆసరా, ఉచిత భీమా, రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీ, పగటి పూట 9 గంటల ఉచిత కరెంట్ వంటివి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని అడిగారు. 

మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన గ్లాసు సింక్ లో ఉండాలని జగన్ అన్నారు. హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ కులానికి చెందిన దీపిక, ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత నిలుచున్నారని... వీరికి ఓటేసి గెలిపించాలని కోరారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. దీనికి అవ్వాతాతలు తిట్టుకుంటుంటే... ఆ నెపాన్ని వైసీపీపై వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని దుయ్యబట్టారు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News