Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు జగన్ రూ.1.15 కోట్లు ఎందుకిచ్చాడు?: ఆనం వెంకటరమణారెడ్డి

Anam questions why Jagan gave money to Varma

  • వర్మ కంపెనీకి రెండు సార్లు నగదు బదిలీ అయిందన్న ఆనం
  • నువ్వేమైనా న్యూడ్ మోడలింగ్ చేస్తే ఆ డబ్బు ఇచ్చారా అంటూ వర్మను నిలదీత
  • జగన్ పట్ల కృతజ్ఞతగా ఆ ఫొటోలు పెడతావా? అంటూ వర్మపై ఆగ్రహం 

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీకి రూ.67.62 లక్షల నగదు బదిలీ అయిందని ఆరోపించారు. మరోసారి రూ.47.33 లక్షల నగదు బదిలీ అయిందని వెల్లడించారు. 

ఈ డబ్బులు ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? నువ్వేమైనా న్యూడ్ మోడలింగ్ చేస్తే ఈ డబ్బులు ఇచ్చారా? లేకపోతే, మోడల్స్ ను తీసుకువచ్చి ఇక్కడేమైనా షో నిర్వహించావా? అనేది స్పష్టత ఇవ్వాలని ఆనం డిమాండ్ చేశారు. సరిగ్గా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే రెండు మూడ్రోజుల ముందు నీకు రూ.1.15 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే... కోడ్ అమల్లోకి వస్తే డబ్బులు రావు కాబట్టి! 

జగన్ మోహన్ రెడ్డి పట్ల కృతజ్ఞతగా ఈ ఫొటోలు (లోకేశ్, పవన్, చంద్రబాబుల మార్ఫింగ్ ఫొటోలు) పెడతావా? రేయ్... మాకు తెలియదు అనుకుంటున్నావా? రేయ్... ఫొటోలు మేం పెట్టలేమా? మాకు సెల్ ఫోన్లు లేవనుకుంటున్నావా? మేం మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టలేమనుకుంటున్నావా?

సంస్కారం ఉంది మాకు... అదే మా పిల్లల పట్ల ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసు కాబట్టి మేం ఇలాంటివి చేయం. ఇలాంటివి మేం చేశామని మా నాయకుడికి తెలిస్తే చెప్పుతో కొడతాడు" అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News