Nagababu: టీచర్ల ఓట్లను అభ్యర్థిస్తూ వీడియో విడుదల చేసిన నాగబాబు

Nagababu released a video requesting teachers votes for NDA and for Pawan Kalyan
  • కరోనా కాలంలో టీచర్లను అవమానించిన వైసీపీకి ఓటు వేయవద్దని కోరిన జనసేన నేత
  • బార్ల ముందు క్యూలైన్లు సర్దే పని అప్పగించారని ప్రస్తావించిన నాగబాబు
  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ గెలుపులో భాగం కావాలని అభ్యర్థన
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి పార్టీలకు ఓటు వేయాలని టీచర్లను అభ్యర్థిస్తూ జనసేన నేత నాగబాబు వీడియో విడుదల చేశారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః .. అని హిందూ సంప్రదాయంలో గురువులను దేవుడితో పోల్చుతామని, అలాంటి గురువుల సంస్కృతిని జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అవమానించిందని అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వైన్ షాపుల ముందు క్యూలు సర్దే పనిని వారికి అప్పజెప్పారని ప్రస్తావించారు. ‘‘విద్యార్థులకు పాఠాలు బోధించిన టీచర్లతో ఇంతకంటే నీచమైన ట్రీట్‌మెంట్ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎవరూ చేసి ఉండరు. ప్రపంచంలో కూడా ఎక్కడా చేసి ఉండరు. కాబట్టి మీ ఉపాధ్యాయ వృత్తిని అగౌరవపరిచిన వైసీపీ ప్రభుత్వానికి టీచర్లు ఓటు వేయకండి.  మీ ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నాశనం చేసిన ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయవద్దు’’ అని నాగబాబు అన్నారు.

కూటమి ప్రభుత్వం టీచర్లకు గౌరవనీయమైన స్థానం, సముచితమైన స్థానం కల్పిస్తుంది. మీకు అన్ని విధాలా ఉపయోగపడే పనులతో ముందుకొస్తుంది. నీచమైన సంస్కృతి కలిగిన వైసీపీ ప్రభుత్వానికి మాత్రం ఓటు వేయకండి. గురువులను ఇంత దారుణంగా అవమానించిన విషయాన్ని మరచిపోయి వైసీపీకి ఓటు వేస్తే చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రక్రియలో మీరు కూడా భాగం కావాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది’’ అని నాగబాబు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.
Nagababu
Pawan Kalyan
Janasena
AP Assembly Polls
YSRCP

More Telugu News