Postal Ballot: పోస్టల్ బ్యాలెట్లో అధికారులు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావడంలేదు: బొప్పరాజు

Bopparaju slams officials on postal ballot polling

  • ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
  • పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగుల ఇబ్బందులపై ఈసీ దృష్టి సారించాలన్న బొప్పరాజు
  • ఓటేసేందుకు వచ్చిన వారిని మరో రోజు రావాలంటున్నారని ఆరోపణ

ఏపీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అమలు జరుగుతున్న తీరుపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగుల ఇబ్బందులపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుని ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఓటేసేందుకు వచ్చిన వారిని మరో రోజు రావాలని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. అధికారులు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావడంలేదని బొప్పరాజు వ్యాఖ్యానించారు. 

ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో కొందరు ఓటేయకుండానే వెనుదిరిగారని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో క్యూలైన్లలో గంటలపాటు నిలబెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. అమలాపురంలో ఆర్టీసీ ఉద్యోగులను మరో రోజు రావాలని చెప్పారని బొప్పరాజు పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ వినిగియోగించుకుని ఓటు వేసేలా ఈసీ చర్యలు తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News