Arvind Kejriwal: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం... కేజ్రీవాల్ పై విచారణకు సిఫార్స్
- నిషేధిత ఖలిస్థాన్ సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందినట్లు ఆరోపణలు
- ఈ కేసులో కేజ్రీవాల్‌ను విచారించాలని ఎల్జీ సిఫార్స్
- ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. నిషేధిత ఖలిస్థాన్ సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 16 మిలియన్ అమెరికా డాలర్లు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించాలని ఎన్ఐఏకు లెఫ్టినెంట్ గవర్నర్ సోమవారం సిఫార్స్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖలిస్థాన్ సంస్థల నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్స్ చేయడం గమనార్హం.