Waterfalls: సమ్మర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?. మీ చెంతనే ఉండే ఈ జలపాతాలపై ఓ లుక్కేయండి!
- ఉరుకుల పరుగుల జీవితంలో ప్రకృతికి దూరంగా మనిషి
- సమ్మర్‌లో సేదదీరాలనుకునే ప్రదేశాల్లో జలపాతాలకే తొలి ప్రాధాన్యం
- దేశంలోనే అతి ఎత్తైన ఈ జలపాతం గురించి మీకు తెలుసా?
మనిషి ఏనాడో ప్రకృతికి దూరంగా జరిగిపోయాడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు క్షణం కూడా తీరికలేకుండా గడిపేస్తుంటారు కొందరు. కాంక్రీటు కీకారణ్యంలో పడి కొట్టుకుపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా అలసి సొలసిన వేళ అలా ప్రకృతి ఒడిలో సేద దీరాలని భావిస్తుంటాడు. అలాంటి వారు తొలుత ఎంచుకునే ప్రదేశాల్లో తప్పకుండా జలపాత ప్రాంతాలుంటాయి.
అంతెత్తున కొండపై నుంచి ముగ్ధమనోహరంగా, పాలపొంగులా దూకుతున్న ప్రవాహాన్ని చూస్తూ తమనుతాము మైమరిచిపోని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. జలపాతాలను సందర్శించి ప్రకృతి ఒడిలో ఓలలాడాలనుకుంటున్నారు సరే.. మరి ఎక్కడికి వెళ్లాలన్నదేగా మీ డౌట్.. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి.. చూసేసి ఈ సమ్మర్‌లో ఎంచక్కా ప్లాన్ చేసుకోండి.