Posani Krishnamurali: చిరంజీవికి ఓటు అడిగే హక్కు లేదు:పోసాని కృష్ణమురళి ఘాటు విమర్శలు
- చిరంజీవి రాజకీయాలకు పనికిరాడని, అన్‌ఫిట్ అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు
- చిరంజీవి సినిమాలను బిజినెస్‌గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్‌గానే చూస్తారంటూ వ్యాఖ్య
- ప్రజలకు వెన్నుపోటు పోడిచిన చిరంజీవికి ఓటు అడిగే హక్కు లేదన్న వైసీపీ నేత
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమాలను బిజినెస్‌గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్‌గా చూస్తారని అన్నారు. ఆయన రాజకీయాలకు పనికిరాడని, అన్‌ఫిట్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి ఏనాడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలతో సమావేశాలను పెట్టలేదని దుయ్యబట్టారు.
కొన్ని రోజులకే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి కేంద్రమంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. కాపు సోదరులు ఎంతో మంది చిరంజీవిని నమ్ముకుని వెంట ఉంటే మోసం చేశారని ఆరోపించారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఓటేయ్యాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. రాజకీయాల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఆయనలో లేవన్నారు.