Jagan: విదేశాలకు వెళ్లాలి... అనుమతి ఇవ్వండి: సీబీఐ కోర్టును కోరిన సీఎం జగన్

CM Jagan urges CBI Court to give permission to go abroad

  • ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాల్లో సీఎం జగన్ పర్యటన
  • బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లనున్న సీఎం జగన్
  • బెయిల్ నిబంధనలు సడలించాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన న్యాయస్థానం
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా

ఏపీ సీఎం జగన్ త్వరలోనే బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 

అక్రమాస్తుల అభియోగాల నేపథ్యంలో సీఎం జగన్ పై అనేక సీబీఐ కేసులు ఉండడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉన్నారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది. 

ఈ నేపథ్యంలో, తాను విదేశాలకు వెళ్లేందుకు వీలుగా బెయిల్ నిబంధనలు సడలించాలని సీబీఐ కోర్టును కోరారు. సీఎం జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి సీబీఐ న్యాయస్థానం... కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

కాగా, ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్యన తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని సీఎం జగన్ తన దరఖాస్తులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News