K Kavitha: మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్... రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ

Kavitha files bail petition in Delhi High Court

  • కవిత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు
  • రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ రాకపోవడంతో పైకోర్టుకు కవిత
  • రేపు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది. బెయిల్ ఇవ్వాలని కవిత రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను ఇటీవల తిరస్కరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఆమె తరఫున న్యాయవాదులు పిటిషన్ వేశారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరని... అందుకే ఆమెకు బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. అంతేకాకుండా మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని కోర్టుకు తెలిపారు. అయితే కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.

మార్చి 15వ తేదీన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. న్యాయస్థానం పలుమార్లు ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ లభించడం లేదు.

  • Loading...

More Telugu News