Chitra: భగవంతుడు అలా డిసైడ్ చేశాడు: గాయని చిత్ర

Chitra Interview
  • అనేక భాషల్లో గాయనిగా చిత్రకి మంచిపేరు
  • ఆమెను వెతుక్కుంటూవచ్చిన పురస్కారాలు 
  • తెలుగు పాటల పట్ల చిత్ర సంతృప్తి 
  • తనని ప్రోత్సహించినవారి ప్రస్తావన

చిత్ర .. ఓ సుస్వరాల సామ్రాజ్యం .. ఓ కమ్మని పాటల తోట. 'సింధుభైరవి' కోసం తెలుగులో ఆమె మొదటిపాటను పాడారు. ఆ తరువాత అనేక భాషల్లోని వారికి తన పాటల పరిమళాలను వెదజల్లారు. పద్మశ్రీ .. పద్మవిభూషణ్ తో పాటు, అనేక పుష్కరాలను ఆమె అందుకున్నారు. ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ ముచ్చట్లను పంచుకున్నారు. 

తెలుగులో నన్ను ఇళయరాజాగారు ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. తెలుగు విషయానికి వస్తే కీరవాణి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు పాడాను. తెలుగు పాటకి సంబంధించినంత వరకూ నాకు ఏదైనా సందేహం వస్తే బాలూగారు చెప్పేవారు. అలాగే మలయాళ పాటలకు సంబంధించి తనకి ఏదైనా డౌట్ వస్తే నన్ను అడిగేవారు" అని అన్నారు. 

"ఇక సీతారామశాస్త్రిగారి పాటలను నేను ఎక్కువగా పాడాను. నా పాటల రికార్డింగ్ కి ఆయన వచ్చేవారు. ఆయన కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆయన రాత్రివేళ మెలకువతో ఉండి పాటలు రాస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా జీవితంలో కొన్ని సంఘటనల కారణంగా నేను క్రిందికి జారిపోతుంటే, మరో వైపు నుంచి నన్ను పైకి లేపడానికి భగవంతుడు ప్రయత్నించాడు" అని చెప్పారు. 

Chitra
Singer
Tollywood

More Telugu News