IPL 2024: చెన్నైపై ఈ సమీకరాణాలతో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ

IPL 2024 Playoffs Scenario Exact Score RCB Need To Beat CSK In Top 4 Race

  • ఇరు జట్లకు చావో రేవోగా మారనున్న మ్యాచ్
  • బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలన్నీ సన్ రైజర్స్ ఆటతీరుపైనే ఆధారం
  • హైదరాబాద్ జట్టుకు ఉన్న రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచినా బెంగళూరుకు సగం చాన్స్
  • అప్పుడు చెన్నైపై 18 పరుగుల తేడాతో లేదా 11 బంతులు మిగిలి ఉండగానే గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్లనున్న బెంగళూరు

ఐపీఎల్ 2024 సమరం ఆసక్తికరంగా సాగుతోంది. గత వారం ముందు వరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా పుంజుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 47 పరుగుల గ్రాండ్ విక్టరీతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. మొత్తం 13 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ లలో విజయం సాధించడం ద్వారా 12 పాయింట్లు సాధించింది. అలాగే + 0.387 నెట్ రన్ రేట్ సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్ ను ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ లోకి చేరుకుంటే మిగిలిన జట్టు ఇంటిముఖం పట్టనుంది. సీఎస్ కే ప్రస్తుతం 13 మ్యాచ్ లలో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.528గా ఉంది.

సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ భవితవ్యం..

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లోకి చేరుతుందా లేదా అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటతీరుపై ఆధారపడనుంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్ లలో 7 గెలిచి 14 పాయింట్లు గెలుచుకుంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ + 0.406గా ఉంది. సన్ రైజర్స్ చివరి రెండు మ్యాచ్ లను వరుసగా గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచినా మెరుగైన రన్ రేట్ కారణంగా సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ లో మూడో స్థానంలోకి చేరుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే చెన్నైతో మ్యాచ్ ఆర్సీబీకి నాకౌట్ మ్యాచ్ కానుంది. 

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో నిలవాలంటే..
ఫాఫ్ డూ ప్లెసీ నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 పరుగులకు పైగా సాధించాలి. అలాగే చెన్నైపై 18 పరుగులకన్నా ఎక్కువ రన్స్ తేడాతో ఓడించాలి. ఒకవేళ చెన్నై తొలి బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే బెంగళూరు జట్టు మరో 11 బంతులు ఉండగానే 201 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయాలి.

  • Loading...

More Telugu News