Telangana: అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా
- పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉందన్న డీజీపీ
- పాతబస్తీలో పోలింగ్ సరళిని సీనియర్ పోలీస్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారని వెల్లడి
- ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని వార్నింగ్
- పోలింగ్ చివరి మూడు గంటలు అప్రమత్తంగా ఉంటామన్న రవిగుప్తా
రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ రవిగుప్తా మీడియాతో చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు చెప్పారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. పాతబస్తీలో పోలింగ్ సరళిని సీనియర్ పోలీస్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇక ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. పోలింగ్ చివరి మూడు గంటలు అప్రమత్తంగా ఉంటామన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం తప్పితే రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.