Chandrababu: తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగడం వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ఠ: చంద్రబాబు

Chandrababu furious after TDP Tadipatri candidate Asmith Reddy being attacked
  • తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా హింస
  • ఎస్పీ వాహనంపై దాడి జరిగిందన్న చంద్రబాబు
  • టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపైనా దాడి జరిగిందని ఆరోపణ
  • ఇది వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ఠ అని ఆగ్రహం
తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా హింస చోటు చేసుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నేటి పోలింగ్ లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే... కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. 

తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దాడి చేయడం, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగడం వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. జగన్ ఐదేళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు ఈ రోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

"ప్రజలారా ఈ కుట్రను మీరే తిప్పి కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న ప్రజలందరూ నిర్భయంగా తరలి వచ్చి ఓటు వేయాలి. అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడిపత్రి ఘటనల తాలూకు వీడియోను కూడా పంచుకున్నారు.
Chandrababu
Tadipatri
Asmith Reddy
TDP
YSRCP
Police

More Telugu News