Daggubati Purandeswari: రాజమండ్రిలో అతి పురాతన గ్రంథాలయాన్ని సందర్శించిన పురందేశ్వరి
- నిన్నటి వరకు బిజీగా గడిపిన పురందేశ్వరి
- ఇవాళ ఆటవిడుపుగా ప్రఖ్యాత గౌతమి గ్రంథాలయ సందర్శన
- నన్నయ వాడిన ఘంటాన్ని అత్యంత ఆసక్తిగా పరిశీలించిన వైనం
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ రాజమండ్రిలో పర్యటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నిన్న పోలింగ్ వరకు ఎడతెరిపి లేని షెడ్యూల్ తో బిజీగా గడిపిన పురందేశ్వరి ఇవాళ ఆటవిడుపుగా, రాజమండ్రిలోని సుప్రసిద్ధ గౌతమి గ్రంథాలయాన్ని సందర్శించారు.
ఇది అతి పురాతన గ్రంథాలయం. ఇక్కడ వందల సంఖ్యలో ఉన్న అనేక ప్రాచీన తాళపత్ర గ్రంథాలను, తెలుగు చరిత్రను వెలుగులోకి తెచ్చిన బ్రిటీష్ అధికారి మెకెంజీ రాతలను పరిశీలించారు. ఇక, ఆదికవి నన్నయ్య రాసేందుకు స్వయంగా ఉపయోగించిన ఘంటాన్ని పురందేశ్వరి అత్యంత ఆసక్తితో తిలకించారు.