Lok Sabha Polls: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 65.66 శాతం పోలింగ్... నగర ప్రాంతంలోనే అతితక్కువ ఓటింగ్
- బుధవారం నాటికి తుది పోలింగ్ శాతంపై స్పష్టత వచ్చే అవకాశం
- భువనగిరిలో అత్యధికంగా 76.78 శాతం పోలింగ్ నమోదు
- హైదరాబాద్‌లో 48.48 శాతం పోలింగ్
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 65.66 శాతం పోలింగ్ నమోదయింది. గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. తుది పోలింగ్‌పై బుధవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశముంది. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం, అత్యల్పంగా 48.48 శాతం ఓటింగ్ నమోదయింది. అన్నింటికంటే పట్టణ ప్రాంతాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లోనే అత్యల్ప ఓటింగ్ నమోదయింది.
వివిధ లోక్ సభ నియోజకవర్గాల ఓటింగ్ ఇలా ఉంది... ఆదిలాబాద్ 74.03 శాతం, పెద్దపల్లి 67.87 శాతం, కరీంనగర్ 72.54 శాతం, నిజామాబాద్ 71.92 శాతం, జహీరాబాద్ 74.63 శాతం, మెదక్ 75.09 శాతం, మల్కాజ్గిరి 50.78 శాతం, సికింద్రాబాద్ 49.04 శాతం, హైదరాబాద్ 48.48 శాతం, చేవెళ్ల 56.50 శాతం, మహబూబ్ నగర్ 72.43 శాతం, నాగర్ కర్నూలు 69.46 శాతం, నల్గొండ 74.02 శాతం, భువనగిరి 76.78 శాతం, వరంగల్ 68.86 శాతం, మహబూబాబాద్ 71.85 శాతం, ఖమ్మం 76.09 శాతం ఓటింగ్ నమోదయింది.