AP Assembly Polls: ఏపీలో 82.37 శాతానికి చేరిన పోలింగ్.. జిల్లాలవారీగా వివరాలు

percent of polling in Andhra pradesh crocess 82 till 12 midnight on Tuesday
  • సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగిన పోలింగ్
  • అనధికారిక సమాచారం ప్రకారం 81.30 శాతం పోలింగ్ నమోదు
  • 1.07 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌తో కలుపుకొని 82.37 శాతానికి చేరినట్టు అంచనా
  • క్షేత్రస్థాయి సమాచారం అందాక పూర్తి పోలింగ్ శాతాన్ని ప్రకటించనున్న ఈసీ
  • అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ముగిసిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ డేటాను ఎన్నికల సంఘం క్రోడీకరిస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగడంతో సమాచార సేకరణలో కొంత జాప్యం జరిగింది. నిన్న పొద్దుపోయాక అందిన అనధికారిక సమాచారం మేరకు ఏపీలో పోలింగ్ 82.37 శాతానికి చేరినట్టు అంచనా. అన్నిచోట్లా పోలింగ్‌ ముగిశాక ఓటింగ్  81.30 శాతంగా నమోదు కాగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 1.07 శాతంతో కలుపుకొని మొత్తం పోలింగ్‌ 82.37 శాతానికి చేరిందని ఎన్నికల సంఘం ప్రాథమికంగా అంచనా వేసింది. క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాత ఈసీ తుది గణాంకాలను అధికారికంగా ప్రకటించనుంది.

ప్రస్తుతం అంచనా వేస్తున్న 82.37 శాతం పోలింగ్ ఏపీ చరిత్రలో అత్యధికం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 2009లో 72.63 శాతం, 2014లో 78.90శాతం, 2019లో 79.80 శాతంగా నమోదయాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ 47కు పైగా కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగిందంటే ఓటర్లు ఏ స్థాయిలో పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు.

జిల్లాలవారీగా ఓటింగ్ శాతం ఇదే..
అల్లూరి   -              63.19 శాతం
అనకాపల్లి -             81.63 శాతం
అనంతపురం -        79.25 శాతం
అన్నమయ్య -          76.12 శాతం
బాపట్ల -                82.33 శాతం
చిత్తూరు -              82.65 శాతం
కోనసీమ -              83.19 శాతం
తూర్పు గోదావరి -    79.31 శాతం
ఏలూరు -              83.04 శాతం
గుంటూరు -           75.74 శాతం
కాకినాడ -             76.37 శాతం
కృష్ణా -                  82.20 శాతం
కర్నూలు -              75.83 శాతం
నంద్యాల -              80.92 శాతం
ఎన్టీఆర్ -                78.76 శాతం
పల్నాడు -               78.70 శాతం
పార్వతీపురం -         75.24 శాతం
ప్రకాశం -               82.40 శాతం
నెల్లూరు -              78.10 శాతం
సత్యసాయి -           82.77 శాతం
శ్రీకాకుళం -           75.41 శాతం
తిరుపతి -              76.83 శాతం
విశాఖపట్నం -        65.50 శాతం
విజయనగరం -       79.41 శాతం
పశ్చిమ గోదావరి -    81.12 శాతం
వైఎస్సార్ -            78.72 శాతం.
AP Assembly Polls
Andhra Pradesh
AP Polling
AP Votting
Election Commission

More Telugu News