AP Elections 2024: ఏపీలో ఈసారి పోటెత్తిన ఓటర్లు.. రికార్డు స్థాయిలో 80.66 శాతం ఓటింగ్ నమోదు
- అధికారికంగా వెల్లడించిన ఏపీ చీఫ్ ఎన్నికల అధికారి
- పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొంటే 81.73 శాతం
- గత ఎన్నికల్లో 79.80 శాతం మాత్రమే పోలింగ్
మొత్తానికి ఏపీ పోలింగ్ శాతంపై స్పష్టత వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగింది. దీంతో ఎంత ఓటింగ్ శాతం నమోదైందన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. సమయం గడుస్తున్న కొద్దీ పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.
2014 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 78.90 శాతం ఓటింగ్ నమోదు కాగా, గత ఎన్నికల్లో 79.80 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, ఈసారి అంతకుమించి ఓటింగ్ నమోదైంది. వందలాది పోలింగ్ బూత్‌లలో అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓటర్లు క్యూలలో నిల్చున్నారు. తాజాగా, ఓటింగ్ శాతం ఎంతన్నదానిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 80.66 శాతం పోలింగ్ నమోదైనట్టు తాజాగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను కూడా కలుపుకుంటే అది మొత్తంగా 81.73 శాతం ఉండొచ్చని అధికారులు తెలిపారు.