Jairam Ramesh: అలాంటి మూలసిద్ధాంతంతో ప‌నిచేసే తొలి ప్రధాని మోదీయే: జైరామ్ రమేశ్ విమర్శలు

Pathological liar no agenda except Hindu Muslim says Jairam Ramesh
  • మోదీ ప్రచార కార్యక్రమం ఆసాంతం హిందు-ముస్లిం చుట్టే తిరుగుతుందని విమర్శ
  • హిందూ-ముస్లిం రాజకీయాలు చేయదలుచుకుంటే ప్రజాజీవితంలో కొనసాగేందుకు పనికిరారని వ్యాఖ్య
  • అస‌త్య‌మేవ జ‌య‌తే అనే మూలసిద్ధాంతంతో ప‌నిచేసే తొలి ప్రధాని మోదీయేనని ఎద్దేవా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమం ఆసాంతం హిందు-ముస్లిం చుట్టే తిరుగుతుందని విమర్శించారు. ఝార్ఖండ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని కేవలం హిందూ-ముస్లిం రాజకీయాలు చేయదలుచుకుంటే ఆయన ప్రజాజీవితంలో కొనసాగేందుకు పనికిరారని వ్యాఖ్యానించారు.

మన జాతీయ చిహ్నం కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుందని... ప్రధాని మాత్రం పొరపాటున కూడా నిజాలు మాట్లాడరని విమర్శించారు. అస‌త్య‌మేవ జ‌య‌తే అనే మూలసిద్ధాంతంతో ప‌నిచేసే తొలి ప్రధాని మోదీయేనని మండిపడ్డారు. అస‌త్యాల‌తో పాల‌న సాగించే మోదీ ఓ బ్ల‌ఫ్ మాస్ట‌ర్ అని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.
Jairam Ramesh
Congress
BJP

More Telugu News