Kangana Ranaut: రూ.91 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపిన కంగనా రనౌత్

Kangana Ranaut assets disclosure shows 50 LIC policies
  • రూ.62.92 కోట్ల స్థిరాస్తులు, రూ.28.73 కోట్ల చరాస్తులు కలిగి ఉన్నట్లు వెల్లడి
  • ముంబై, పంజాబ్, మనాలీలో తన ఆస్తులు ఉన్నాయన్న కంగనా
  • సొంతంగా తనకు బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ సహా మూడు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలిపిన కంగనా రనౌత్
హిమాచల్ ప్రదేశ్ మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సినీ నటి కంగనా రనౌత్ తన ఆస్తులను వెల్లడించారు. రూ.91 కోట్ల విలువచేసే ఆస్తులు తన పేరిట ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అఫిడవిట్ వివరాల ప్రకారం, రూ.62.92 కోట్ల స్థిరాస్తులు, రూ.28.73 కోట్ల చరాస్తులు కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

తన చేతిలో నగదు రూపంలో రూ.2 లక్షలు ఉన్నట్టు వెల్లడించారు. రూ.1.35 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని తెలిపారు. ముంబై, పంజాబ్, మనాలీలో తన ఆస్తులు ఉన్నాయన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4 కోట్ల 12 లక్షల పైచిలుకు ఆదాయం పన్నుగా చెల్లించినట్లు తెలిపారు. సొంతంగా తనకు బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ సహా మూడు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలిపారు.

తన వద్ద రూ.5 కోట్ల విలువైన 6.70 కిలోల బంగారం ఉందని, రూ.5 లక్షల విలువైన 60 కిలోల వెండి ఉందని, రూ.3 కోట్ల విలువైన 14 క్యారెట్ల డైమండ్స్ ఉన్నట్లు వెల్లడించారు. 50 ఎల్ఐసీ పాలసీలు ఉన్నట్లు తెలిపారు.
Kangana Ranaut
BJP
Lok Sabha Polls

More Telugu News