Stock Market: చివర్లో కొనుగోళ్ల మద్దతు.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 677 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 203 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా ఈ ఉదయం నుంచి సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంలో సూచీలు ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, భారతి ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 677 పాయింట్లు లాభపడి 73,663కు పెరిగింది. నిఫ్టీ 203 పాయింట్లు పుంజుకుని 22,403 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.05%), టెక్ మహీంద్రా (2.66%), భారతీ ఎయిర్ టెల్ (2.53%), ఇన్ఫోసిస్ (2.26%), టైటాన్ (2.17%).
టాప్ లూజర్స్:
మారుతి (-2.16%), టాటా మోటార్స్ (-1.15%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.04%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.78%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.56%).