Revanth Reddy: హైదరాబాద్ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy review on Hyderabad rains

  • అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
  • ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచన
  • ఉదయ్ నగర్ ప్రాంతంలో వర్షం ధాటికి దెబ్బతిన్న నాలా
  • నాలా ప్రాంతాన్ని పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బంజారాహిల్స్, సచివాలయం, అమీర్ పేట, కూకట్‌పల్లి, హిమయత్ నగర్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మోకాలు లోతు వరకు నీరు నిలిచింది. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

దెబ్బతిన్న నాలాను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి

బంజారాహిల్స్‌లోని ఉదయ్ నగర్ ప్రాంతంలో వర్షం ధాటికి నాలా దెబ్బతింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ నాలా ప్రాంతాన్ని పరిశీలించారు. నాలా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News