Rain Alert: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- బలహీనపడిన ఉపరితల ఆవర్తనం
- మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
నేడు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నల్గొండ, ములుగు, పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, యాదాద్రి, మహబూబాబాద్, నల్గొండ, జోగులాంబ గద్వాల్, హనుమకొండ, వరంగల్, వనపర్తి, నారాయణపేట, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.