TET: తెలంగాణలో సోమవారం నుంచి టెట్ పరీక్షలు... ఏర్పాట్ల పూర్తి

All set for TET in Telangana

  • మే 20 నుంచి జూన్ 2 వరకు తెలంగాణలో టెట్
  • రోజుకు రెండు సెషన్ల చొప్పున టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్
  • రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో టెట్ పరీక్షలు
  • ఈ ఏడాది టెట్ కు 2.86 లక్షల మంది దరఖాస్తు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం (మే 20) నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ వెల్లడించారు. 

టెట్ కు ఈసారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలిసారిగా టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. 

టెట్ కు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి.

  • Loading...

More Telugu News