Warangal: వరంగల్ లో చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్లిన యువతి.. వీడియో వైరల్

saree wearing girl rides sports bike in warangal netizens amused

  • ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఆమెను చూసి వాహనదారుల అవాక్కు
  • గ్రీన్ సిగ్నల్ పడగానే గేర్ మార్చి రయ్యిమంటూ వెళ్లిన వైనం
  • జెట్టీ బైకర్ గర్ల్ పేరిట ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను పంచుకున్న యువతి
  • ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

సాధారణంగా మహిళలు యాక్టివా లాంటి గేర్లు లేని టూ వీలర్ నడుపుతూ మాత్రమే కనిపిస్తుంటారు. గేర్లతో కూడిన, వారి వస్త్రధారణకు అనువుగా లేని బైక్ లను నడపడం చాలా అరుదు. కానీ వరంగల్ లో మాత్రం ఓ యువతి చీర కట్టులోనే స్పోర్ట్స్ బైక్ పై రివ్వున దూసుకెళ్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వరంగల్ కు చెందిన ఆ యువతికి స్పోర్ట్స్ బైక్ నడపడమంటే పిచ్చి. ఇందుకోసం ఏకంగా జెట్టీ బైకర్ గర్ల్ పేరిట ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేస్తోంది. వివిధ డ్రెస్ లు ధరించి బైక్ నడిపిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటోంది. అయితే ఎక్కడా తన మొహం కనిపించకుండా ప్రతి వీడియోలోనూ హెల్మ్ ట్ ధరిస్తూ ఫొటోలు, వీడియోలు పెడుతోంది. అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ నడిపిన వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియోలో బైక్‌ పై యువతి ట్రాఫిక్ సిగ్నల్ వ‌ద్ద ఆగింది. పిస్తా క‌ల‌ర్‌ చీర, అందుకు మ్యాచింగ్ గాజులు కూడా వేసుకుంది. బైక్ పై వెళ్తున్న మరో కుటుంబంలో వెనక కూర్చున్న మహిళ..  ఆ యువతిని కాసేపు అలాగే చూస్తుండిపోయింది. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే గేర్ మార్చి దూసుకెళ్లింది. ఈ నెల 5న ఇన్ స్టా లో పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 3.16 లక్షల లైక్ లు లభించాయి.

ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ఆ యువతిని శివంగి అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘బైక్ పై బయటకు స్వతంత్రంగా వెళ్తున్న యువతి.. ఆమె పక్కనే ఉన్న బైక్ పై భర్తపై ఆధారపడి బయటకు వచ్చిన మహిళ’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. నేటి ఆధునిక కాలంలో యువతులంతా ఇలానే ఉండాలని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

https://www.instagram.com/reel/C6ldpNqpsnk/?utm_source=ig_web_copy_link
  • Loading...

More Telugu News