SBI: ఆ లింకులు వెరీ డేంజర్... ఖాతాదారులకు ఎస్ బీఐ అలర్ట్
- ఎస్ బీఐ రివార్డ్స్ పేరిట ఖాతాదారులకు సందేశాలు
- ఇలాంటి సందేశాలను తాము ఎప్పుడూ పంపబోమన్న ఎస్ బీఐ
- ఖాతాదారులు ప్రమాదకర లింకులపై క్లిక్ చేయరాదని వెల్లడి
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన ఖాతాదారులకు హెచ్చరిక సందేశాలు పంపింది. ఎస్ బీఐ రివార్డ్స్ (SBI rewardz) పేరిట వాట్సాప్ సందేశాల రూపంలో కొన్ని లింకులు వస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిపై క్లిక్ చేయవద్దని వెల్లడించింది.
రివార్డు పాయింట్లు అంటూ ఖాతాదారులకు తాము ఎలాంటి లింకులు పంపబోమని ఎస్ బీఐ స్పష్టం చేసింది. ఎస్ బీఐ యోనో యాప్ ఏపీకే ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని తాము ఎప్పుడూ కోరబోమని పేర్కొంది.
వాట్సాప్ సందేశాలు, ఎస్సెమ్మెస్ ల రూపంలో ఇచ్చే ప్రమాదకర లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికావొద్దని సూచించింది.