Chiranjeevi: 'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో మెగాస్టార్!

 Chiranjeevi in Mohan Raja Movie
  • 'విశ్వంభర' షూటింగులో బిజీగా చిరంజీవి 
  • మోహన్ రాజా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ 
  • గతంలో ఈ కాంబోలో వచ్చిన 'గాడ్ ఫాదర్'
  • లైన్ లోనే ఉన్న మారుతి - హరీశ్ శంకర్  

చిరంజీవి ఇప్పుడు 'విశ్వంభర' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీవశిష్ఠ దర్శకత్వంలో .. యూవీ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమౌతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత ఏ దర్శకుడితో చిరంజీవి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్లు చాలామంది ఆయనతో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు మోహన్ రాజా - చిరంజీవి కాంబినేషన్లో 'గాడ్ ఫాదర్' సినిమా వచ్చింది. 'లూసిఫర్' రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 2022లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. 

అయితే ఇప్పుడు మోహన్ రాజా వినిపించిన కథ, చిరంజీవికి బాగా నచ్చిందట. అందువలన ఆయన ఈ ప్రాజెక్టును ముందుగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే మోహన్ రాజా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక మారుతి .. హరీశ్ శంకర్ దర్శకత్వంలోను చిరంజీవి సినిమాలు చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది చూడాలి.
Chiranjeevi
Mohan Raja
Maruthi
Harish Shankar

More Telugu News